: సాలీళ్లు, తేళ్లు, నల్లులు, కీచురాళ్లు వంటి వాటిని ఆరగించిన ఏంజెలీనా జోలీ
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ నటించిన ‘ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కంబోడియా వెళ్లిన ఏంజెలీనా తన ఆరుగురు పిల్లలతో కలిసి బీబీసీ వరల్డ్ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా కంబోడియా ఆహారపుటలవాట్లు విభిన్నంగా ఉంటాయని తెలిపింది. అంతే కాకుండా తన పిల్లలతో కలసి ఆమె నల్లులు, కీచురాళ్లు, సాలీళ్లు, తేళ్లు వంటి కీటకాలను వండుకొని తింది.
యుద్ధ సమయాల్లో ఆకలి దప్పులు ఓర్చుకోలేక కంబోడియన్లు ఇలాంటివే ఆహారంగా తీసుకుని జీవించారని చెప్పింది. తన సినిమా ‘ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్’ కూడా కంబోడియాకి చెందిన ఖ్మేర్ రోజ్ కాలంనాటి సంఘటనల ఆధారంగా రూపొందినదని తెలిపింది. కాగా, ఈ సినిమాకి ఏంజెలినా స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఏంజెలినా పెంచుకుంటున్న పిల్లల్లో పెద్దవాడైన మడాక్స్ కంబోడియా దేశానికి చెందిన వాడన్న సంగతి తెలిసిందే. అక్కడే మడాక్స్ ను ఏంజెలినా దత్తత తీసుకుంది.