: ఇక సీఎం చంద్రబాబుకు లేఖలు రాస్తూనే ఉంటా: జగన్
అధికారంలోకి వచ్చి 33 నెలలు అవుతున్నప్పటికీ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి కల్పించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇకపై తాను చంద్రబాబు నాయుడికి లేఖలు రాస్తూనే ఉంటానని కూడా జగన్ పేర్కొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలన్నింటిని లేఖల ద్వారా గుర్తు చేస్తుంటానని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన భృతి బకాయిలు లక్షా 15 వేల కోట్లు అని ఆయన తెలిపారు.