: నటి అమలాపాల్ కు విడాకులు మంజూరు!


2014 జూన్ 12న హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్ లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో, ఇద్దరూ విడిపోయారు. ఆరు నెలల జ్యుడీషియల్ సెపరేషన్ పీరియడ్ లో భాగంగా గత ఆగస్ట్ నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ నిన్న విడాకులు మంజూరు చేసింది. దీంతో, వీరి బంధం పూర్తిగా తెగిపోయింది.

ప్రస్తుతం అమలాపాల్ పలు చిత్రాలతో చాలా బిజీగా ఉంది. సిండరెట్టా, అచ్చాయన్స్, అమ్మడు హెబ్బులి, వడ చెన్నై, వేళ ఇల్ల పట్టదారి 2 (రఘువరన్ బీటెక్ 2), తిరుట్టు పాయలె 2 చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు 'వనమగన్' చిత్రంతో దర్శకుడిగా విజయ్ బిజీగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News