: హిందూ దేవుళ్ల చిత్రాలను అవమానకరరీతిలో ముద్రించిన వెబ్ సైట్లపై కేసు నమోదు!


హిందువుల మ‌నోభావాలను దెబ్బ‌తీసేలా ‘ఓం’ చిహ్నాన్ని బూట్లపై ముద్రించారు. బీర్ బాటిల్‌పై వినాయకుడి ఫొటోను అచ్చు వేయించారు. ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన యస్ విబే, లాస్ట్ కోస్ట్ వెబ్ సైట్ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ రెండు వెబ్‌సైట్‌లు అమెరికాకు చెందినవి. మ‌రిన్ని వివ‌రాలు చూస్తే.. స‌ద‌రు రెండు వెబ్‌సైట్ లు హిందువుల మ‌నోభావాలు కించ‌ప‌రచేలా ఆయా చిహ్నాల‌ను ముద్రించాయ‌ని భార‌త‌ విదేశాంగ మంత్రిత్వ శాఖకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్‌ నరేశ్‌ కాడ్యాన్‌ ఫిర్యాదు చేశారు. ఆ ఉత్పత్తులను అమ్మకుండా చూడాలని కోరారు. అనంత‌రం ఆయ‌న ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News