: నాకు 22 ఏళ్లున్నప్పుడు 35 ఏళ్ల వ్యక్తులతో పోల్చి చూశారు: విరాట్ కోహ్లీ
పుణె వేదికగా రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా టీమ్‌ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... టీమిండియా ఎంతో బలంగా ఉందని అన్నాడు. ఆస్ట్రేలియా జట్టు గురించి తాము ఆందోళన చెందడం లేదని పేర్కొన్నాడు. తాను జట్టుతో పాటు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ మెరుగవుతున్నానని వ్యాఖ్యానించాడు. ఆసీస్ జట్టులో కొందరు మాత్రమే ఫామ్ లో ఉన్నారని, తనకు 22 ఏళ్లున్నప్పుడు 35 ఏళ్ల వ్యక్తులతో పోల్చి చూశారని, ప్రస్తుతం క్రమక్రమంగా తాను ఆ దశకు చేరుకుంటున్నానని అన్నాడు. కాగా, రేపటినుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో కసరత్తు చేస్తున్నారు. సొంత గడ్డపై తిరుగులేని విజయాలు అందుకుంటున్న టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.