: మంత్రి పోచారం హైదరాబాద్ కు తరలింపు
ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. స్వామి వారి దర్శనానంతరం అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో, వెంటనే ఆయనను సమీపంలోని అశ్వని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఈ క్రమంలో, కొండపైనే ఉన్న అపోలో వైద్యుల బృందం కూడా అక్కడకు చేరుకుని ఆయనకు వైద్య సేవలు అందించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో, ఆయనను హైదరాబాద్ పంపించారు. ఆయన వెంట ఒక వైద్య బృందం కూడా వుంది.