: అక్కినేని అఖిల్, శ్రియాభూపాల్ పెళ్లి క్యాన్సిల్?
అక్కినేని నాగార్జున కుమారుడు, యంగ్ హీరో అఖిల్ నిశ్చితార్థం శ్రియాభూపాల్ తో ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, వీరి వివాహం క్యాన్సిల్ అయిందనే సంచలన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. పెళ్లి ఎందుకు రద్దు అయిందనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే అఖిల్, శ్రియాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని, వివాహం క్యాన్సిల్ కావడానికి ఇదే కారణమని కొందరు చెబుతున్నారు.
ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియాలతో మాట్లాడారని... అయినా ఫలితం లేకపోవడంతో, మ్యారేజ్ క్యాన్సిల్ చేశారని సమాచారం. వీరిద్దరి పెళ్లి మే నెలలో ఇటలీలో జరగాల్సి ఉంది. పెళ్లి నేపథ్యంలో, హోటళ్లు, రిసార్టులు బుక్ చేయడం కూడా జరిగింది. కానీ, చివరకు ఈ తతంగం ఓ షాకింగ్ గా ముగిసింది. దీనికి సంబంధించి, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.