: కుళ్లిన మాంసంతో బిర్యానీ.. బావర్చీ హోటల్ సీజ్!


నాణ్యతను పాటించకుండా, డబ్బు సంపాదనే లక్ష్యంగా, వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది. హైదరాబాదు, హబ్సిగూడలోని రోడ్ నెంబర్-8లో ఉన్న శ్రీనిధి బావర్చీ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యం కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారు చేసి, విక్రయిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ హోటల్ కు లైసెన్స్ కూడా లేదని చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News