: ఐటీ కంపెనీల దుర్మార్గం.. ఫ్రెషర్స్ జీతాలు పెంచకుండా పని చేయించుకుంటున్న వైనం


మన దేశంలో ప్రతి ఏడాది వేలాది మంది ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకుంటున్నారు . వీరిలో మెజార్టీ విద్యార్థుల లక్ష్యం ఒక్కటే. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సెటిల్ అవడం. కొందరేమో క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా జాబ్స్ కొట్టేస్తున్నారు. మరికొందరేమో, ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్ని కోర్సులు పూర్తి చేసి, జాబ్ పట్టేస్తున్నారు. చాలా మంది జాబ్ కోసం దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వస్తున్నారు. ఇదే అంశాన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఐటీ కంపెనీలన్నీ కుమ్మక్కై... ఫ్రెషర్ల జీతాలను పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. ఈ క్రమంలో, అవి మాత్రం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి.

గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా ఐటీ సంస్థలు ఫ్రెషర్స్ జీతాలను తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఫ్రెషర్స్ కు భారత ఐటీ సంస్థలు సరైన జీతాలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. వీరి జీతాలు పెరగకుండా టాప్ ఐటీ కంపెనీలన్నీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఐటీ సంస్థలు ఇలా వ్యవహరించడం... ఈ రంగానికి అంత మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మెరుగైన జీతాలు ఇవ్వకపోతే ప్రతిభ ఉన్న ఫ్రెషర్స్ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపరని మోహన్ దాస్ తెలిపారు. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో చేరుతున్న వారిలో ఎక్కువ శాతం సెకండ్ గ్రేడ్ కాలేజీల నుంచి వస్తున్నారని... అయినప్పటికీ, వారిలో నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. టాప్ గ్రేడ్ కాలేజీల నుంచి కూడా ఫ్రెషర్స్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News