: తెలంగాణ డీజీపీ పదవీకాలం పొడిగింపు
రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి అనురాగ్ శర్మ పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తూ, ఆయన పదవీకాలాన్ని మరో తొమ్మిది నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆయన 2017 నవంబర్ 12వ తేదీ వరకు డీజీపీగా కొనసాగుతారు. అనురాగ్ శర్మ 1982 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 2015 నవంబర్ 13న తెలంగాణ డీజీపీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు.