: హైదరాబాద్ ‘భాగ్య’ నగరమే.. సంపన్న నగరాల జాబితాలో మూడో స్థానం
దేశంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. ముంబై, బెంగళూరు తర్వాతి స్థానాన్ని భాగ్యనగరం దక్కించుకుంది. ‘న్యూ వరల్డ్ వెల్త్’ నివేదిక ప్రకారం గతేడాది డిసెంబరు నాటికి హైదరాబాద్ మొత్తం సంపద విలువ రూ.21.08 లక్షల కోట్లు. నగరంలో మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్నవారి సంఖ్య 9 వేలని లెక్క తేలింది. దేశంలో 2.64 లక్షల మంది వార్షికాదాయం సుమారు రూ.6.8 కోట్లు ఉంటే, వీరిలో 9 వేల మంది మిలియనీర్లు ఒక్క హైదరాబాద్లోనే ఉన్నారు. ఏడాదికి వంద కోట్ల డాలర్లకు పైగా ఆదాయం ఉన్న వారిలో ఆరుగురు భాగ్యనగరంలో ఉన్నట్టు ‘న్యూ వరల్డ్ వెల్త్’ నివేదిక వివరించింది.
సంఖ్యాపరంగా చూస్తే ముంబైలో అత్యధికంగా 46 వేల మంది మిలియనీర్లు ఉండగా కోల్కతా (9,600), హైదరాబాద్ (9 వేలు), బెంగళూరు (7,700), చెన్నై (6,600), పుణె (4,500), గురుగ్రామ్ (4 వేలు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక దేశంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్కు మూడో స్థానం దక్కింది. ఈ విషయంలో ముంబై 32 వేల కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా బెంగళూరు రెండోస్థానంలో నిలిచింది. బిలియనీర్ల సంఖ్యలోనూ భాగ్యనగరానికి మూడో స్థానం దక్కడం గమనార్హం.