: ఇషాంత్ శర్మ కనీస ధర చూసి ఆశ్చర్యపోయా!: గౌతమ్ గంభీర్
ఐపీఎల్ 10 సీజన్ నిమిత్తం ఇటీవల నిర్వహించిన వేలంలో టీమిండియా ఫేస్ బౌలర్ ఇషాంత్ శర్మకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఇషాంత్ ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనపరచలేదు. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ, ఇషాంత్ తన కనీస ధరను మరీ ఎక్కువగా పెట్టుకున్నాడని, ఈ ధర చూసి తాను ఆశ్చర్యపోయానని, అంత ధర చాలా ఎక్కువ అని అన్నాడు. కాగా, ఇషాంత్ శర్మ తన కనీస ధరను రూ.2 కోట్లుగా పేర్కొన్నాడు.