: ఇంట్లో పడుకున్న జేఏసీ నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లారు: తెలంగాణ విద్యావంతుల వేదిక


ఈ రోజు నిరుద్యోగుల నిరసన ర్యాలీ తలపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాంను ముందస్తు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు కోదండరాం సహా పలువురు జేఏసీ నేతలను అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు మండిపడుతున్నారు. కోదండరాం ఇంటి తలుపులను గడ్డపారలతో పగుల గొట్టారని,ఇంట్లో పడుకున్న జేఏసీ నాయకులను ఈడ్చు కొచ్చి మరీ, పోలీసులు అరెస్టు చేశారని వారు మండిపడ్డారు. కాగా, నిరుద్యోగుల ర్యాలీలో పాల్గొనే నిమిత్తం హైదరాబాద్ కు వచ్చే వారిని అదుపు చేసేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. సూర్యాపేట పట్టణంలో 40 మంది విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News