: బళ్లారిలో కుప్పకూలిన రథం.. 30 మందికి గాయాలు


కర్ణాటకలోని బళ్లారి జిల్లా కొట్టూరులో గురు కుట్టురేశ్వరస్వామి రథోత్సవ వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడ నిర్వహిస్తున్న జాతరలో 60 అడుగుల రథం చక్రం విరగడంతో కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 30 మంది భక్తులకు గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను బళ్లారిలోని విమ్స్ కు తరలించారు.

  • Loading...

More Telugu News