: అలాంటి పరిస్థితి నాకు ఎదురైతే .. వాడిని చంపేస్తా: నటి రకుల్
మలయాళ నటి భావనపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. అలాంటి సంఘటన కనుక తనకు ఎదురైతే, అలా చేసిన వాడిని అక్కడే కొడతానని, చంపేస్తానని ఘాటుగా స్పందించింది. సిమ్లాకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన ఓ సంఘటన గురించి ఈ సందర్భంగా రకుల్ ప్రస్తావించింది. తన ఫొటోలు తీస్తున్న ఓ వ్యక్తిని రోడ్డుపైనే కొట్టానని చెప్పింది. నటి భావన సంఘటన తర్వాత తన అభిప్రాయం మారిపోయిందని, మహిళా దినోత్సవాలు, మాతృమూర్తుల దినోత్సవాలు .. వంటివి నిర్వహించడం ఎందుకు అనిపిస్తోందని, ఒక మహిళకు రక్షణ కల్పించనపుడు ఈ దినోత్సవాలు జరుపుకోవడంలో అర్థం లేదని, పేపరు ప్రకటనలకు మాత్రమే ఇవి పరిమితమై పోయాయని రకుల్ విమర్శించింది.