: ఓపెన్ టాప్ కారులో బాలీవుడ్ బాద్ షా తో లిటిల్ షా!
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన కొడుకు అబ్రామ్ తో కలిసి ఓపెన్ టాప్ కారులో తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. ముంబయిలోని గల్లీల్లో షారూక్ కారు నడుపుతుంటే, అబ్రామ్ ను పట్టుకుని షారూక్ సెక్యూరిటీ గార్డు ముందు సీట్లో కూర్చున్నాడు. దీంతో, ఎంచక్కా, అటూఇటూ చూస్తూ అబ్రామ్ ఎంజాయ్ చేస్తుంటే.. తనయుడి సంతోషాన్ని చూసిన షారూక్ మరింత ఉత్సాహంగా డ్రైవ్ చేశాడు. అయితే, ఓపెన్ టాప్ కారులో వెళ్తున్న బాలీవుడ్ బాద్ షా, లిటిల్ షా ను చూసిన ప్రజలు ఇది కలయా? నిజమా? అని ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షారూక్ ఫ్యాన్ క్లబ్ సహా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.