: వాట్సప్ లో ప్రియుడికి మెసేజ్ చేసి చనిపోయింది: సునీత కేసును ఛేదించిన పోలీసులు


హైదరాబాద్‌లోని మాదాపూర్‌ భాగ్యనగర్‌ సొసైటీలో అనుమానాస్ప‌దస్థితిలో మృతి చెందిన టెలికాలర్‌ సునీతది ఆత్మహత్యగా పోలీసులు ఈ రోజు నిర్ధారించారు. ఆమె ప్రియుడు పృథ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌ర‌ప‌గా సునీత ఆయ‌న‌కు పంపిన వాట్స‌ప్ మెసేజ్‌లు క‌నిపించాయ‌ని పోలీసులు తెలిపారు. అందులో పృథ్వీరాజ్‌ని సునీత పెళ్లి చేసుకోవాల‌ని కోరింద‌ని, లేదంటే చ‌నిపోతాన‌ని చెప్పింద‌ని, చివ‌రికి అన్నంత ప‌నీ చేసింద‌ని పోలీసులు చెప్పారు.
 
సునీత మరణంలో బ‌య‌టి వ్య‌క్తుల ప్ర‌మేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు గ‌త‌కొన్ని రోజులుగా ద‌ర్యాప్తు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆమె మృత‌దేహానికి పోస్టు మార్టం కూడా చేశారు. ప‌లు సీసీ టీవీ ఫుటేజీల‌ను గ‌మ‌నించారు.

  • Loading...

More Telugu News