: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 17న ఏపీలో 7, తెలంగాణ లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల కానుంది. నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 7 చివరి తేదీ కాగా, 8న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.