: రిలయన్స్ జియో తాజా ప్రకటనపై స్పందించిన సీఓఏఐ
రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య పది కోట్లకు చేరిన సందర్భంగా ఈ రోజు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ ఇకపై టారిఫ్ వార్ లోకి ప్రవేశిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ప్రకటనపై సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) స్పందిస్తూ హర్షం వ్యక్తం చేసింది. రిలయన్స్ ఉచిత సేవలకు గుడ్ బై చెప్పడంపై సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 , 2017 నుంచి జియో అమలు చేయనున్న టారిఫ్‌లను ప్రకటించడం టెలికాం రంగ పరిశ్రమకు మంచి వార్త అని పేర్కొంది. ముఖేశ్ అంబానీ ప్రకటించిన రూ.99 ప్రైమరీ మెంబర్ షిప్ ప్లాన్, రూ.303 వెల్‌కం ఆఫర్ సౌకర్యాల ప్లాన్స్ మంచివేనని తెలిపింది.