: వైఎస్ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు: షర్మిల ఆరోపణ
కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేయడమే కాకుండా, వైఎస్ పథకాలకు తిలోదకాలిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత షర్మిల ఆరోపించారు. ప్రజల శ్రేయస్సును విస్మరిస్తోన్న కిరణ్ ప్రభుత్వాన్ని సాగనంపాలని షర్మిల పిలుపునిచ్చారు. మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు.