: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్.. స్వాగతం పలికిన ఏపీ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తీశ్వరాలయం వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అక్కడనుంచి ఆయన నేరుగా తిరుమలకు బయలుదేరారు. రేపు ఉదయం ఆయన శ్రీవారి సేవలో పాల్గొని వేంకటేశ్వరుడికి కానుకలు సమర్పించనున్నారు. అనంతరం అక్కడ జరగనున్న తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి వివాహానికి హాజరవుతారు. ఇప్పటికే తిరుమలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ చేరుకున్నారు.