: రాహుల్, అఖిలేష్ సభలో అపశ్రుతి.. సభా వేదిక కూలడంతో పలువురికి గాయాలు!
ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచార ర్యాలీల్లో పాల్గొంటూ నేతలు బిజీబిజీగా ఉన్నారు. అయితే, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లు కలిసి ఈ రోజు పాల్గొంటున్న అలహాబాద్ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా వేదిక కూలిపడిపోవడంతో పలువురు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. నాలుగోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్, అఖిలేష్ మరికాసేపట్లో అక్కడ ప్రసంగించనున్నారు. వేదికపైకి అధిక సంఖ్యలో నేతలు ఎక్కడంతోనే స్టేజీ కూలిపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.