: చిరంజీవి, సురేఖల పెళ్లి నాటి శుభలేఖ, ఫొటో చూడండి!
నిన్న మెగాస్టార్ చిరంజీవి, సురేఖల 37వ మ్యారేజ్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని గీతామయి వృద్ధాశ్రమంలో అన్నదానం, వస్త్రదానం చేసిన చిరంజీవి యువత మెగాస్టార్ పై తమ అభిమానాన్ని చాటుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి పెళ్లి శుభలేఖ, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటంతో ఆయన అభిమానులు ఈ ఫొటోలను చూసి తెగ మురిసిపోతున్నారు.
పెళ్లి దుస్తుల్లో ఉన్న చిరంజీవి, సురేఖలు నమస్కరిస్తున్న దృశ్యం ఓ ఫొటోలో ఉంది. మరో ఫొటోలో పెళ్లి శుభలేఖ .. దాని పక్కనే చిరంజీవి, సురేఖ దంపతుల ఫొటో ఉన్నాయి. కాగా,1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో మద్రాసులో ఉదయం 10.50 గంటలకు జరిగింది. అదే రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య రిసెప్షన్ కార్యక్రమం జరిగింది.