: ఎమ్మెల్యే కాకాని ఈ నెల 14 నుంచి క‌నిపించ‌కుండా పోయారు: సోమిరెడ్డి


కొన్ని రోజుల క్రితం త‌న‌పై తీవ్ర‌ ఆరోప‌ణ‌లు గుప్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... కాకాని ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉన్నార‌ని, అయితే, ఆయ‌న ఈ నెల 14 నుంచి క‌నిపించ‌కుండా పోయార‌ని సోమిరెడ్డి ఆరోపించారు. తప్పు రుజువు చేస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని వ్యాఖ్య‌లు చేసిన కాకాని, ఇప్పటికైనా మాటపై నిలబడాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్న కాకాని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News