: అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి.. నిరసన ర్యాలీని చేసితీరతాం!: ప్రొ.కోదండరాం
హైదరాబాద్లో నిరుద్యోగ నిరసన ర్యాలీకి అనుమతి కోరుతూ టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో వేసిన పిటిషన్ నేపథ్యంలో న్యాయస్థానం నుంచి తమకు అనుకూలంగా తీర్పురాకపోవడంతో టీజేఏసీ మరోసారి భేటీ అయింది. రేపు నిర్వహించతలపెట్టిన ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన కోదండరాం తన నివాసంలో టీజేఏసీ నేతలతో కీలక చర్చలు జరిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ కోసం తాము ఈ ర్యాలీకి పిలుపునిచ్చామని తెలిపారు. ఫిబ్రవరీ 1నే ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నామని అన్నారు. దీనిపై ప్రభుత్వ తమతో చర్చలు కూడా జరపలేదని అన్నారు. నేరుగా డీసీపీ వద్దకు వెళ్లి అనుమతి ఇవ్వాలని కోరామని, వారి నుంచి కూడా స్పందన రాలేదని అన్నారు. చివరికి కోర్టుకు వెళ్లామని చెప్పారు. అప్పటి నుంచి తమపై వేధింపులు మొదలయ్యాయని కోదండరాం అన్నారు. ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని చెప్పారు.