: మెగాస్టార్ పెళ్లిరోజు సందర్భంగా వస్త్రదానం!
మెగాస్టార్ చిరంజీవి నిన్న 37వ పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని గీతామయి వృద్ధాశ్రమంలో చిరంజీవి యువత వస్త్రదానం చేశారు. వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చిరంజీవి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, దాసరి సేవా సమితి నాయకులు బాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.