: జియో వెల్‌కమ్ ఆఫర్లలో ఉన్న సౌకర్యాలన్నీ స్పెషల్ రీఛార్జ్ తో పొందవచ్చు: ముఖేష్ అంబానీ
తమ జియో యూజర్ల సంఖ్య పది కోట్లకు చేరిన సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ విజయం ప్రతి వినియోగదారుడి సొంతమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జియో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించనున్నట్లు తెలిపారు. వెల్‌కమ్ ఆఫర్లలో ఉన్న సౌకర్యాలన్నీ ఇకపై నెలకు రూ.303 రీఛార్జ్‌తో ఏడాది పాటు అందుకోవచ్చని తెలిపారు. తమ వినియోగదారులకు 24 గంటలూ అత్యుత్తమ సేవలను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే 10 కోట్ల మంది జియో యూజర్లను సొంతం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.