: ఆధార్ ఉంటే చాలు.. డబ్బు పంపుకోవచ్చు, తీసుకోవచ్చు!
ఇకపై డబ్బు పంపుకోవడానికి, డబ్బు తీసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ అవసరం ఉండకపోవచ్చు. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు. మన ఆధార్ కార్డుపై ఉండే 12 అంకెల నెంబరే రానున్న రోజుల్లో సింగిల్ పాయింట్ పేమెంట్ అడ్రస్ గా మారబోతోంది. పేమెంట్స్ బ్యాంక్ ఇండియా పోస్టు ద్వారా 112 కోట్లకు పైనున్న భారతీయులు ఆధార్ నెంబర్ తోనే డబ్బును పంపించడం, తీసుకునేలా సన్నాహకాలు జరుగుతున్నాయి. తొలుత ఈ సదుపాయాన్ని దేశంలోని 650 జిల్లాల్లో కవర్ చేయనున్నారు. ఆ తర్వాత ఈ సదుపాయాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు.