: ఆ సినిమాలో రణ్ బీర్ కపూర్ అచ్చం సంజయ్ దత్ లా ఉన్నాడు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రను రణ్ బీర్ కపూర్ పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం కొన్ని కిలోల బరువు కూడా రణ్ బీర్ పెరిగాడట. సంజయ్ దత్ తన కుర్ర వయసులో ఏ విధంగా ఉండేవాడో రణ్ బీర్ కపూర్ అదే విధంగా ఈ సినిమాలో కనపడతాడట. ఇదిలా ఉండగా,ఈ చిత్రంలో ఓ సన్నివేశం నిమిత్తం వదులుగా ఉన్న దుస్తులు ధరించిన రణ్ బీర్ కపూర్ ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రణ్ బీర్ కపూర్ హెయిర్ స్టైల్ నాడు సంజయ్ దత్ హెయిర్ స్టైల్ ను పోలి ఉండటం గమనించవచ్చు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి. కాగా, సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను పరేష్ రావెల్ పోషిస్తుండగా, తల్లి నర్గీస్ దత్ పాత్రలో మనీషా కొయిరాలా నటిస్తోంది. ఈ చిత్రంలో సోనమ్ కపూర్, అనుష్క శర్మ కూడా నటిస్తున్నారు.