: జియో ద్వారా ఒక్క నెలలోనే వంద కోట్ల జీబీ డేటాను వాడేశారు: ముఖేష్ అంబానీ
ఉచితంగా అపరిమిత కాల్స్, డేటాను అందిస్తూ టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో.. ఊహించని రీతిలో వినియోగదారులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. తమ జియో యూజర్ల సంఖ్య పది కోట్లకు చేరిన సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే వంద కోట్ల జీబీ డేటాను వాడినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, మొబైల్ డేటా వాడకంలో ప్రపంచంలోనే మనదేశం అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు.
తమకు మార్కెట్లో వస్తోన్న ఆదరణను గురించి ముఖేష్ అంబానీ వివరిస్తూ.. గత 170 రోజులుగా సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో యూజర్లుగా మారారని చెప్పారు. జియో నెట్‌వర్క్‌లో ప్రతి రోజూ 5.5 కోట్ల గంటల వీడియోను చూస్తున్నారని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని 99 శాతం జనాభాను జియో కవర్ చేస్తుందని ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. రూ.99 కే జియో ప్రైమ్ మెంబర్ షిప్‌ను మార్చి 1 నుంచి ప్రారంభించనున్నారు. రూ.99కే ఏడాది సభ్యత్వం ఇవ్వనున్నారు.