: తన మాజీ ప్రియురాలితో పాటు ఆమెకు కాబోయే భర్తపై జవాను దాడి.. ఒకరి మృతి
పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. జవానుగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలికి కాబోయే భర్తను హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే... ఆర్మీ జవాన్ కమల్ దేవ్, శివాని శర్మ అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే, వారి పెళ్లికి పెద్దలు అడ్డుతగలడంతో విడిపోయారు. అనంతరం సదరు యువతికి నీరజ్‌కుమార్ (27) అనే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. శివాని, నీరజ్‌లు తమ సొంత గ్రామమైన ఉనా నుంచి నాలాగఢ్ వెళ్లడానికి బస్సులో బయల్దేరగా కమల్‌దేవ్ వారిని వెంబడించాడు.
పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో శివాని, నీరజ్‌లు బస్సు దిగగానే ఇద్దరిపైనా పదునైన ఆయుధంతో దాడి చేయడంతో నీరజ్ మెడకు తీవ్రగాయాలై, ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన శివానిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి, కమల్‌దేవ్‌ను పట్టుకుని చితక్కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.