: భావనకు మద్దతు తెలిపిన సమంత, శ్రద్ధ, సిద్ధార్థ్


లైంగిక వేధింపులకు గురైన ప్రముఖ నటి భావనకు సినిమా రంగం నుంచి మద్దతు లభిస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటి సమంత కూడా మద్దతు ట్విట్టర్ ద్వారా తెలిపింది. భావనను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పిన సమంత...నువ్వెంతో ధైర్యవంతురాలివి, నువ్వు మళ్లీ కార్యరంగంలోకి దూకాలి అంటూ సాంత్వన వ్యాఖ్యాలు ట్వీట్ చేసింది. బాలీవుడ్ నటి శ్రధ్ధా కపూర్ ట్వీట్ చేస్తూ...ఈ ఘటన గురించి వినగానే తన గుండె బద్దలైందని పేర్కొంది. దీనిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నానని తెలిపింది. హీరో సిద్ధార్థ్ దీనిపై స్పందిస్తూ...ఆమె వెంట ఉంటానని తెలిపాడు. 

  • Loading...

More Telugu News