: పాక్ కు షాక్... హఫీజ్ సయీద్ పై వ్యాఖ్యల తర్వాత మూడు చోట్ల ఆత్మాహుతి దాడి


ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న పాకిస్థాన్ కు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ వేదికపై హఫీజ్ సయీద్ కు వ్యతిరేకంగా మాట్లాడిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ లోని ఖైబర్ ఫక్తూంఖ్వాలోని ఛార్ సద్దా జిల్లా కోర్టు ప్రాంగణంలో మూడు వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. అనంతరం కొందరు ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు, పలువురు మృత్యువాతపడ్డారు. ఘటనలో మృతులు, క్షతగాత్రులపై పూర్తి వివరాలు అందాల్సి ఉండగా, వీరి సంఖ్య భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఉగ్రవాదులను కోర్టులో హాజరుపరుస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. 

  • Loading...

More Telugu News