: నరాలు తెగే ఉత్కంఠ... నా జీవితాన్ని మార్చేసే ధర అది: బెన్ స్టోక్స్


ఐపీఎల్ వేలంపై ఆసక్తిగా ఎదురు చూశానని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడు బెన్ స్టోక్స్ తెలిపాడు. తనకు లభించిన ధరపై హర్షం వ్యక్తం చేసిన బెన్ స్టోక్స్ అది తన జీవితాన్ని మార్చేసే ధర అని ఉప్పొంగిపోయాడు. ఐపీఎల్ వేలంపాటలో పాల్గొనాలని తెల్లవారు జాము 3 గంటలకే అలారం పెట్టుకున్నానని చెప్పాడు. తాను టీవీలో లైవ్ చూడలేదని, ట్విట్టర్ లో వేలాన్ని ఫాలో అయ్యానని అన్నాడు. అభిమానుల ట్వీట్స్ వల్ల క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగిందని, చివరకు తనను పూణే సూపర్ కింగ్స్ దక్కించుకుందని, అది కూడా భారీ మొత్తానికి అని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నాడు. ఇప్పుడు తనకు మాటలు రావడం లేదని చెప్పాడు. గత కొంత కాలంగా తన జీవితంలో అన్నీ మంచి విషయాలే జరుగుతున్నాయని, ఈ వారం తనకు బాగా కలిసి వచ్చిందని పేర్కొన్నాడు.

కాగా, ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ రికార్డు నెలకొల్పాడు. పూణే జట్టు అతనిని 14.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా, బెన్ స్టోక్స్ కు పెట్టిన ధర అతని ప్రతిభకు వెచ్చించదగ్గదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొత్తబంతితో మెరుపులు మెరిపించగల స్టోక్స్, బ్యాటుతో అద్భుతాలు చేయగలడు. ఇంగ్లండ్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ లో స్టోక్స్ ఒకడన్న సంగతి తెలిసిందే. అలాగే ఆ జట్టుకు కీలక బౌలర్ కూడా..దీంతో బెన్ స్టోక్స్ తన ప్రతిభను ప్రదర్శిస్తే ఐపీఎల్ లో పూణే లక్ష్యం నెరవేరినట్టేననడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

  • Loading...

More Telugu News