: కృష్ణా నదిలో తేలిన పురాతన ఆలయం!


తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల వద్ద కృష్ణానది అవతలి ఒడ్డున పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వరాలయం ఉంది. ఎంతో ప్రశస్తి కలిగిన ఈ ఆలయం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పూర్తిగా మునిగిపోయింది. అయితే, గత వారం రోజులుగా నీటి మట్టం భారీగా తగ్గడంతో, గుడి పడమటి భాగం పూర్తిగా తేలింది. కానీ, గర్భగుడిలో మాత్రం మోకాళ్ల లోతు వరకు ఇంకా నీళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆలయ అర్చకులు రఘురామశర్మ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. శివమాలధారులు గర్భగుడిలోని వేపలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News