: ఈపీఎస్ గెలిచినా, ఓపీఎస్ గెలిచినా మాకు ఒరిగేది ఏమీ లేదు: హీరో విశాల్ తీవ్ర వ్యాఖ్యలు


తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకునే సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై ప్రముఖ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ స్పందించాడు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని చెప్పాడు. చట్టసభల్లో సభ్యులు హుందాగా మెలగాలని అన్నాడు. అయితే, ఈపీఎస్ (పళనిస్వామి) గెలిచినా, ఓపీఎస్ (పన్నీర్ సెల్వం) గెలిచినా తమకు ఒరిగేది ఏమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలోని రైతులంతా కరవు కోరల్లో చిక్కుకున్నారని, అయినా రైతాంగాన్ని కాపాడే నాథుడే లేడని విమర్శించాడు. ప్రస్తుత పాలకులైనా తమకు ఓటేసిన ప్రజల కష్టసుఖాలను పట్టించుకుంటారని ఆశపడుతున్నట్టు చెప్పాడు. కడలూరు జిల్లా పిచ్చావరం వద్ద 'తుప్పరివాలన్' సినిమా షూటింగ్ లో విశాల్ పాల్గొంటున్నాడు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, విశాల్ పైవ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News