: ఏపీకి గుడ్ న్యూస్.. ప్రత్యేక ప్యాకేజీకి రేపే చట్టబద్ధత!


ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి తీపి కబురు అందనుంది. ప్రత్యేక ప్యాకేజీకి రేపు (బుధవారం) చట్టబద్ధత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒత్తిడితో కేంద్రమంత్రి సుజనా చౌదరి రెండు రోజులుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ అధికారులను కలసి కసరత్తు చేస్తున్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో లోపాలు లేకుండా చూడాలన్న చంద్రబాబు ఆదేశాలతో సుజనా చౌదరి ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలు కూడా కేబినెట్ అజెండాలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News