: నేను లేకపోతే ఏం... సెహ్వాగ్ తోపాటు ఇతరులున్నారుగా?: ప్రీతి జింటా
గత ఐపీఎల్ సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా ఆటగాళ్ల వేలానికి దూరంగా ఉండడం ఆసక్తి రేగుతోంది. ఐపీఎల్ తో విశేషమైన అనుబంధం ఉన్న ప్రీతి వివాహం తరువాత జరుగుతున్న తొలి ఐపీఎల్ ఇది. ఈ సీజన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పలుమార్లు ఆసక్తి వ్యక్తం చేసిన ప్రీతి జింటా చివరకు వేలానికి గైర్హాజరైంది.
దీనిపై ఆమె వివరణ ఇస్తూ, తాను చాలా బిజీగా ఉన్నానని, అందుకే ఐపీఎల్ వేలానికి హాజరుకాలేకపోయానని తెలిపింది. అయినా తాను దూరంగా ఉంటే ఏం? వీరేంద్ర సెహ్వాగ్, ఇతర ప్రముఖులంతా అందుబాటులోనే ఉన్నారని, తమ జట్టుకు ఏం కావాలో తనకంటే వారికే బాగా తెలుసని, ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామని ప్రీతి జింటా ఆశాభావం వ్యక్తం చేసింది.