: నేడే కేసీఆర్ తిరుమల పర్యటన.. పెద్ద ఎత్తున అనుచరులు కూడా!
తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేసిన మొక్కులు చెల్లించేందుకు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు తిరుమల బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ఆయనతో పాటు భారీ ఎత్తున అనుచరులు తిరుమల చేరుకోనున్నారు. రెండు ప్రత్యేక విమానాల్లో సీఎం కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల అధికారులు వెళ్తున్నారు. వీరే కాకుండా రోడ్డు మార్గంలో కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తిరుపతి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేటి సాయంత్రానికి ఏపీ చేరుకోనున్న కేసీఆర్, రాత్రి తిరుమలలో బసచేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొని తిరుమలేశుని దర్శించుకోనున్నారు.