: తల్లిదండ్రులు కుమార్తెను అంగడి వస్తువును చేస్తే...స్థానికులు ఆదుకున్నారు!


కని, పెంచిన తల్లిదండ్రులు కనికరం లేకుండా, కుమార్తెను అంగడి సరకుగా మారిస్తే... చుట్టూ వున్న స్థానికులు రక్షించిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో 14 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు హర్యానాకు చెందిన వ్యక్తికి విక్రయానికి పెట్టారు. తల్లిదండ్రులకు 7 లక్షల రూపాయలు చెల్లించిన ఆ వ్యక్తి ఆమెను తీసుకెళ్లిపోయేందుకు సంసిద్ధుడయ్యాడు. కన్నీరుమున్నీరవుతున్న బాలికను తల్లిదండ్రుల నుంచి విడదీసి కారులోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా, స్థానికులు బాలికను ఆరాతీశారు. విషయం తెలియడంతో బాలికను రక్షించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, అమ్మిన తల్లిదండ్రులతో పాటు కొనుగోలు చేసిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News