: భార్య తలనరికి.. కోర్టులో లొంగిపోయేందుకు బయల్దేరిన భర్త... అరెస్టు చేసిన పోలీసులు
జార్ఖాండ్ లో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భుబాన్ (38)కు భార్యపై అనుమానం. దీంతో గత రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఇది తీవ్రంగా మారడంతో భార్య తలనరికిన భుబాన్, ఆమె మొండాన్ని దగ్గర్లోని పొలంలో పడేశాడు. అనంతరం కోర్టులో లొంగిపోయేందుకు ఆమె తల సంచీలో వేసుకుని బయల్దేరాడు. ఇంతలో ఆమె మొండాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల, మొండాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతనిని కోర్టు రిమాండ్ కు పంపింది.