: వినియోగదారుడే రారాజు: సుప్రీం వ్యాఖ్య


భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది. వినియోగదారుడే మహారాజ లబ్దిదారుడు అన్న సుప్రీం, ఎఫ్ డీఐ అమలు వెనుక ఉన్న సిద్ధాంతం ఇదే అయినప్పుడు, ఆ విధానం ప్రవేశపెట్టడంలో తప్పేమిటని ప్రశ్నించింది. భారత ఆర్ధిక వ్యవస్థకు పెను చీడగా పరణమించిన దళారీ వ్యవస్థను రూపుమాపడమే ఈ విధానం లక్ష్యమని, అందుకే దాన్ని స్వాగతించాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

చిల్లర వర్తకంలో బహుళ జాతి కంపెనీలకు ద్వారాలు తెరిచే ఎఫ్ డీఐ విధాన ప్రకటనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. జస్టిస్ ఆర్ ఎమ్ లోథా నేతృత్వంలో జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతేగాకుండా, ఈ విధానాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందని సుప్రీం పేర్కొంది.

  • Loading...

More Telugu News