: జయలలిత విషయంలో అలా ఎందుకు ప్రకటించలేదు?: స్టాలిన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతికి సంబంధించి ఇప్పటికీ తనకు అనుమానాలు ఉన్నాయని డీఎంకే నేత స్టాలిన్ మరోమారు పేర్కొన్నారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రులుగా చేసిన అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ మరణించినప్పుడు వారి మృతి గురించి అధికారిక ప్రకటనలు చేశారని, జయలలిత విషయంలో ఆ విధంగా ఎందుకు జరగలేదని స్టాలిన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. కాగా, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో చోటుచేసుకున్న ఘటననూ ఆయన ప్రస్తావించారు. ఆ రోజు రహస్య బ్యాలెట్ నిర్వహించి ఉంటే పళనిస్వామి సీఎం అయి ఉండేవారే కాదని స్టాలిన్ పేర్కొనడం గమనార్హం.