: వైఎస్ జగన్ ని కలిసి, మద్దతు కోరిన ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన రెడ్డిని ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ రాము సూర్యారావు (ఆర్ ఎస్ ఆర్) కలిశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరామని, అందుకు, జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ వైఎస్సార్సీపీ తమకు మద్దతుగా నిలిచిందని ఆర్ఎస్ఆర్ పేర్కొన్నారు.