: మంత్రాలు చదువుతుంటే పడిపడి నవ్విన పవన్ కల్యాణ్!
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ చేనేత గర్జన సభలో పడిపడి నవ్విన ఘటన చోటుచేసుకుంది. చేనేత గర్జన సభ సందర్భంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ చేనేత కార్మికులు చేపట్టిన దీక్షను నిమ్మరసం ఇచ్చి ఆయన విరమింపజేశారు. అనంతరం పవన్ కల్యాణ్ చేనేత గర్జన సభా వేదికపైకి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేపట్టిన చేనేత బ్రాండ్ అంబాసిడర్ కార్యక్రమం విజయవంతం కావాలంటూ పండితులు వేద మంత్రాలు పఠించి, అంతా శుభం జరగాలని కాంక్షించారు.
ఈ సమయంలో వారి మంత్రాలు వింటూ పవన్ కల్యాణ్ పడిపడి నవ్వాడు. ఈ క్రమంలో తన నవ్వును నియంత్రించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమై మళ్లీ నవ్వేశాడు. ఈ ఘటన వేదిక దగ్గర, టీవీల ముందున్న వారిలో కూడా చిరునవ్వులు పూయించింది. కాగా, పవన్ కల్యాణ్ గతంలో పలు సందర్భాల్లో తాను మూర్ఖ భక్తుడిని కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే.