: భారత్ కు అనుకూలంగా పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన పాక్ ఆర్మీ


భారత సైన్యం అలవలంబిస్తున్న విధానం తనకు చాలా నచ్చిందని పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ బజ్వా చెప్పినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ ఆర్మీ కొట్టి పారేసింది. ఈ మేరకు భారత్, పాక్ మీడియాల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఈ వార్తలన్నీ కావాలని రాసిన కట్టుకథలని మండిపడ్డారు.

మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం... పరిపాలనలో భారత సైన్యం అసలు జోక్యం చేసుకోదని ఖమర్ బజ్వా తెలిపారు. ఆర్మీ జోక్యం లేకుండానే ప్రజాస్వామ్య పద్ధతిలో భారత్ విజయవంతంగా పాలన కొనసాగిస్తోందని చెప్పారు. మనం కూడా భారత్ లాగానే ఉండాలని ఆయన తెలిపారు. ఆయన చెప్పినట్టు వచ్చిన ఈ వార్త సంచలనం సృష్టించింది. పాక్ లో ఎక్కువ కాలం సైనిక పాలనే కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ కథనాలు సైన్యానికి కోపం తెప్పించాయి. ఈ కథనం రాసిన మీడియాపై తీవ్ర చర్యలకు పాక్ ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News