: భావన కిడ్నాప్ కు ముందు నిందితుడు బడా నిర్మాతతో మాట్లాడాడా?


ప్రముఖ సినీ నటి భావన కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడి గురించి ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సునీల్.. భావన కిడ్నాప్ కు ముందు ఓ బడా నిర్మాతతో మాట్లాడినట్టు కాల్ లిస్టు ద్వారా రుజువైనట్టు తెలుస్తోంది. నిర్మాతతో మాట్లాడిన అనంతరం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. అంతకు ముందు మరో ఐదుగురు ప్రముఖులతో అతను మాట్లాడినట్టు ఫోన్ రికార్డ్స్ చెబుతున్నాయి.

ఈ కేసులో మరింత మంది ప్రమేయంపై అనుమానాలున్నాయని, అవన్నీ నివృత్తి చేసుకున్న అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడు సునీల్ కు అతని కుటుంబంతో పెద్దగా సంబంధాలు లేవని, 17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడని, కొన్ని నెలల క్రితం ఇంటికి వచ్చి అందర్నీ పలకరించి వెళ్లాడని అతని సోదరి వెల్లడించింది. భావన ఘటనలో నేరముఠా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి తెరతీసినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News