: జూ వద్ద జడేజా మరో సాహసం!


టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి సాహసం చేశాడు. గతంలో గిర్ అభయారణ్యంలో విహారానికి భార్యతో కలిసి వెళ్లిన రవీంద్ర జడేజా సిబ్బంది సహకారంతో సింహాల ముందు ఫోటోలకు పోజులిచ్చి తీవ్ర విమర్శలు కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరోసారి రవీంద్ర జడేజా ఓ జూకి వెళ్లి అక్కడ ఫెన్సింగ్ దగ్గరగా వచ్చిన సింహాన్ని ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే ఈ సారి రక్షణగా ఫెన్సింగ్ ఉండడంతో నెటిజన్ల నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. జడేజా అభిమానులు మాత్రం తమ అభిమాన క్రికెటర్ సాహసం పట్ల మురిసిపోతున్నారు. 

  • Loading...

More Telugu News