: కీలక ప్రకటన చేసిన మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్


టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లు కీలక ప్రకటన చేశాయి. భారత్ లోని ఆన్ లైన్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఒక్కటవుతున్నట్టు ప్రకటించాయి. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ లు ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ, ఫ్లిప్ కార్ట్ సాధించింది చూస్తుంటే తనకు ఎంతో ఆశ్చర్యమేస్తుంటుందని చెప్పారు. ఒక్క ఈకామర్స్ రంగంలోనే కాకుండా, లాజిస్టిక్స్, పేమెంట్స్ రంగాల్లో కూడా ఫ్లిప్ కార్ట్ ఎంతో సాధించిందని అన్నారు. తన పబ్లిక్ క్లౌడ్ ప్లాట్ ఫాం కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ను ఫ్లిప్ కార్ట్ ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

మరోవైపు బన్సాల్ మాట్లాడుతూ, తమ రెండు సంస్థల కలయిక వల్ల బలం మరింత పెరుగుతుందని చెప్పారు. గత ఐదేళ్లలో వినియోగదారుల సంఖ్యను 5 లక్షల మందికి పెంచుకున్నామని.. రానున్న పదేళ్లలో ఈ సంఖ్యను 50 లక్షలకు పైగా ఎలా పెంచుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News