: జయలలిత వాడిన కుర్చీలో పళనిస్వామి!


తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి సారించారు. ఐదు నెలల తర్వాత తొలిసారి జయలలిత కార్యాలయానికి వెళ్లి ఆమె వాడిన కూర్చీలోనే కూర్చున్నారు. జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆ కుర్చీలో ఎవరూ కూర్చోలేదు. పన్నీర్ ముఖ్యమంత్రి అయినా... జయ మీదున్న గౌరవంతో ఆ కార్యాలయానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు జయ లేకపోవడంతో, పళనిస్వామి మాత్రం ఆ సెంటిమెంట్లను పట్టించుకోలేదు. నేరుగా కార్యాలయానికి వెళ్లి, జయ కుర్చీలో కూర్చొని, కొన్ని ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు. అయితే, బాధ్యతలను స్వీకరించే సమయంలో మాత్రం జయలలిత ఫొటోను టేబుల్ పై పెట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News